ఆర్కేనగర్ ఉపఎన్నికలో దినకరన్ ఘన విజయం!

  • అధికార అన్నాడీఎంకే అభ్యర్థిపై సుమారు 40 వేల పైచిలుకు ఓట్లతో విజయం
  • మూడో స్థానానికే పరిమితమైన ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థి
  • దినకరన్ నివాసం వద్ద సంబరాలు
ఆర్కేనగర్ ఉపఎన్నికలో శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ పై సుమారు 40,707 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థి మురుదు గణేష్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

ప్రత్యర్థులపై తొలి రౌండ్ నుంచి తుది రౌండ్ వరకు దినకరన్ ఆధిక్యం కనబరిచారు. ఈ ఉపఎన్నికలో దినకరన్ కు 89,013 ఓట్లు, అన్నా డీఎంకేకు 48,306 ఓట్లు, డీఎంకేకు 24,651 ఓట్లు లభించాయి. ఈ ఉప ఎన్నికలో ఒకే ఒక పోస్టల్ బ్యాలెట్ పోలైంది. కాగా, దినకరన్ విజయంతో ఆయన నివాసం వద్ద  అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Go Back to Shorts
chennai
dinakaran

More Telugu News